"వాహ్.. వరంగల్" అనిపిస్తాం: ఎర్రబెల్లి
దిశ, వరంగల్: చారిత్రక, సాంస్కృతిక వైభవాల వరంగల్ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసి వాహ్ వరంగల్ అనిపిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ అర్భన్ జిల్లా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఫాతిమా జంక్షన్ లో హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై రూపొందించిన లవ్ హైదరాబాద్ తరహాలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా రూపొందించిన ‘వాహ్ వరంగల్’ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ […]
దిశ, వరంగల్: చారిత్రక, సాంస్కృతిక వైభవాల వరంగల్ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసి వాహ్ వరంగల్ అనిపిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ అర్భన్ జిల్లా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఫాతిమా జంక్షన్ లో హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై రూపొందించిన లవ్ హైదరాబాద్ తరహాలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా రూపొందించిన ‘వాహ్ వరంగల్’ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ అంటే ఓ చరిత్ర, వరంగల్ అంటే అభివృద్ధికి, గొప్ప సంస్కృతికి, గొలుసుకట్టు చెరువులకు, సహజ సిద్ధమైన రిజర్వాయర్లకు ఓ ఐకాన్ అన్నారు. ఈ ఒరవడిని కొనసాగిస్తూనే, పూర్వ వైభవాన్ని ఇనుమడింప చేస్తూ, అపూర్వ వైభవాన్ని తెస్తామన్నారు. పచ్చదనం-పరిశుభ్రత, అద్భుత కట్టడాలు, దేవాలయాలు, తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచాయన్నారు. అలాగే, ఒకప్పుడు అజంజాహీ మిల్లు, ఇప్పుడు అపెరల్, ఐటీ వస్త్ర పరిశ్రమలు, రైల్వే జంక్షన్, విస్తారమైన నగరం, విద్యా అవకాశాలు, రాష్ట్ర రాజధానికి రెండో రాజధానిగా వరంగల్ ఉందన్నారు. త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయ్యి, మరిన్ని పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉందన్నారు. నిజంగానే ప్రజలు వరంగల్ ని చూసి వాహ్ వరంగల్ అనే పరిస్థితిని తెస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కంటే కూడా వరంగల్ ది పురాతన చరిత్ర అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అన్నారు. హైదరాబాద్ కి లవ్ హైదరాబాద్ లాగా, వరంగల్ కి వాహ్ వరంగల్ ఓ ఐకాన్ కానుందన్నారు. వరంగల్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి వాహ్ వరంగల్ అనే విధంగా తీర్చిదిద్దుతామని వినయ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, లోక్ సభ సభ్యుడు పసునూరి దయాకర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, పలువురు కార్పొరేటర్లు, మార్కెట్ చైర్మన్ సదానందం, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.