జూన్1 నుంచి ఆధ్యాత్మిక కేంద్రాలు ఓపెన్..ఎక్కడంటే
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో జూన్ 1వ తేదీ నుంచి అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు తెరుచుకోనున్నట్టు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే, ఒకే సారి పది మందికి మించి అనుమతి ఉండదని, ఒకే దగ్గర గుమిగూడే వేడుకలపై నిషేధం కొనసాగుతుందన్నారు. విలేకరులతో ఆమె ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, తేయాకు, జ్యూట్ పరిశ్రమలు పూర్తిస్థాయి సిబ్బందితో నడిచేందుకు అనుమతినిచ్చామని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలూ 100శాతం సిబ్బందితో పనిచేయొచ్చని వివరించారు. గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం […]
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో జూన్ 1వ తేదీ నుంచి అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు తెరుచుకోనున్నట్టు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే, ఒకే సారి పది మందికి మించి అనుమతి ఉండదని, ఒకే దగ్గర గుమిగూడే వేడుకలపై నిషేధం కొనసాగుతుందన్నారు. విలేకరులతో ఆమె ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, తేయాకు, జ్యూట్ పరిశ్రమలు పూర్తిస్థాయి సిబ్బందితో నడిచేందుకు అనుమతినిచ్చామని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలూ 100శాతం సిబ్బందితో పనిచేయొచ్చని వివరించారు. గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా కరోనాను కట్టడి చేస్తున్నదని, వలస కార్మికుల ప్రవేశంతోనే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.లాక్‌డౌన్ 4.0 ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మమత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.