సీఎం కేసీఆర్ పేరిట ఆలయాల్లో పూజలు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మహమ్మారి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆయన పేరిట ప్రత్యేక పూజలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజారులను కోరారు. దేవాలయాల్లో జరిగే పూజల్లో ఆరోగ్య సిద్ధి చేకూర్చాలని, సంపూర్ణ ఆరోగ్యంతో కరోనా నుంచి క్షేమంగా బయట పడాలని అర్చనలు చేయాలని సూచించారు. ప్రజలు, దేవుడి ఆశీసులతో త్వరలోనే సీఎం కోలుకొని ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి ఆకాంక్షించారు. శ్రీరామ నవమిని ఇళ్లలోనే జరుపుకోండి […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మహమ్మారి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆయన పేరిట ప్రత్యేక పూజలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజారులను కోరారు. దేవాలయాల్లో జరిగే పూజల్లో ఆరోగ్య సిద్ధి చేకూర్చాలని, సంపూర్ణ ఆరోగ్యంతో కరోనా నుంచి క్షేమంగా బయట పడాలని అర్చనలు చేయాలని సూచించారు. ప్రజలు, దేవుడి ఆశీసులతో త్వరలోనే సీఎం కోలుకొని ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి ఆకాంక్షించారు.
శ్రీరామ నవమిని ఇళ్లలోనే జరుపుకోండి
రాష్ట్ర ప్రజలకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోన వైరస్ ప్రభావం ఉన్నందున ఎవరి ఇళ్లలో వారే పండుగను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. శ్రీరాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని, కరోనా మహమ్మారి నుంచి త్వరగా విముక్తి కల్పించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే కొవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.