కరోనా దెబ్బకు క్రీడారంగం కుదేలు!

కరోనా వైరస్ ప్రపంచ క్రీడారంగం పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపెడుతోంది. కొన్ని భారీ ఈవెంట్లు ఇప్పటికే రద్దు కాగా, ఇంకొన్ని వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఒలింపిక్స్ నిర్వహణ కూడా డైలమాలో పడింది. పెద్ద క్రీడా ఈవెంట్ల రద్దుతో నిర్వాహకులతో పాటు బ్రాడ్‌కాస్టర్లు కూడా వందల కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కొన్ని క్రీడలైతే ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. దీంతో టికెట్లకు సంబంధించిన రెవెన్యూను కోల్పోయి నష్టాలు మరింతగా పెరిగిపోయాయి. మెల్‌బోర్న్‌లో జరిగిన […]

Update: 2020-03-13 08:24 GMT

కరోనా వైరస్ ప్రపంచ క్రీడారంగం పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపెడుతోంది. కొన్ని భారీ ఈవెంట్లు ఇప్పటికే రద్దు కాగా, ఇంకొన్ని వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఒలింపిక్స్ నిర్వహణ కూడా డైలమాలో పడింది. పెద్ద క్రీడా ఈవెంట్ల రద్దుతో నిర్వాహకులతో పాటు బ్రాడ్‌కాస్టర్లు కూడా వందల కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కొన్ని క్రీడలైతే ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. దీంతో టికెట్లకు సంబంధించిన రెవెన్యూను కోల్పోయి నష్టాలు మరింతగా పెరిగిపోయాయి.

మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్ నుంచి చైనీస్ ప్లేయర్లను నిషేధించారు. అంతేకాకుండా డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి కూడా చైనా టీమ్ విత్‌డ్రా అయ్యింది. ఒలింపిక్స్‌కు సన్నాహక టోర్నీగా భావించే ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్‌షిప్ చైనాలో నిర్వహించాల్సి ఉండగా.. కరోనా భయాందోళనల నేపథ్యంలో అదీ రద్దయింది. ఇక షాంఘైలో ఫార్ములా 1 గ్రాండ్‌ ప్రీ ఏప్రిల్ 19 నుంచి జరగాల్సి ఉంది. కాగా ఇప్పుడు దాన్ని వాయిదా వేయాలని నిర్వాహకులు నిర్ణయించారు.

చైనాలో నిర్వహించాల్సిన పలు క్రీడా టోర్నమెంట్ల రద్దుతో ఒక మిలియన్ డాలర్ల నష్టం వచ్చినట్లు ఒక నివేదిక తేల్చింది. ఇప్పటికే బహ్రెయిన్ గ్రాండ్ ప్రీని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించారు. దీంతో టికెట్ల రెవెన్యూ కోల్పోవలసి వచ్చింది. సౌత్ కొరియాలో కూడా కరోనా విజృంభనతో పలు క్రీడా ఈవెంట్లను రద్దు చేశారు. జిన్‌చున్‌లోని నేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా తాత్కాలికంగా మూసి వేశారు. ఒలంపిక్స్ సాధన కోసం కొరియా దేశ అథ్లెట్లను ఆస్ట్రేలియాకు పంపించారు. మరోవైపు ఇటలీలో కూడా ఫుట్‌బాల్ లీగ్స్ వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జరగాల్సిన పలు అంతర్జాతీయ మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాన్‌టీనో ప్రకటించారు.

ఇక పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ నుంచి పలువురు క్రికెటర్లు వైదొలిగారు. ఇండియా, దక్షిణాఫ్రికా వన్డేలు కూడా రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. ఇవన్నీ కరోనా ఆందోళన నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలే. కరోనా ఎఫెక్ట్ మరో రెండు నెలల పాటు క్రీడారంగంపై ఉంటుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags: Corona effect, Major tournaments cancel, china, shanghai, Millions of money, Ons day series. IPL

Tags:    

Similar News