90 ఏళ్ల వయసులో జాబ్.. గిన్నిస్ బుక్‌కు ఎక్కిన బామ్మ
దిశ, ఫీచర్స్ : పదేళ్లు సర్వీస్‌లో ఐదుకు పైగా ఆఫీస్‌లు చేంజ్ చేయడం, పదిహేనేళ్ల సర్వీస్ పూర్తి కాగానే ఏం ఉద్యోగం రా బాబు, నా వల్ల కాదు అని అనుకోవడం సర్వసాధారణం. అంతేకాదు ఆరు పదులు వయసు దగ్గరికి వచ్చే సరికి రిటైర్‌మెంట్ తీసుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. కానీ జపాన్‌కు చెందిన యసుకో తమాకి మాత్రం తనకు ఉద్యోగ విరమణ చేసే ఉద్దేశం లేదని చెబుతోంది. 90 ఏళ్ల వయసులోనూ చలాకీగా ఆఫీస్‌కు వస్తూ, […]
దిశ, ఫీచర్స్ : పదేళ్లు సర్వీస్‌లో ఐదుకు పైగా ఆఫీస్‌లు చేంజ్ చేయడం, పదిహేనేళ్ల సర్వీస్ పూర్తి కాగానే ఏం ఉద్యోగం రా బాబు, నా వల్ల కాదు అని అనుకోవడం సర్వసాధారణం. అంతేకాదు ఆరు పదులు వయసు దగ్గరికి వచ్చే సరికి రిటైర్‌మెంట్ తీసుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. కానీ జపాన్‌కు చెందిన యసుకో తమాకి మాత్రం తనకు ఉద్యోగ విరమణ చేసే ఉద్దేశం లేదని చెబుతోంది. 90 ఏళ్ల వయసులోనూ చలాకీగా ఆఫీస్‌కు వస్తూ, అందరిలానే వీక్‌లో ఐదు రోజులు, ప్రతీ రోజు 7.5 గంటలు పని చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తొంది. ప్రపంచంలోని ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్న సదరు నారీమణి గురించి మరిన్ని విశేషాలు.
మే 15, 1930న జన్మించిన తమాకి 1956 నుంచి సన్‌కో ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్నారు. తన జీవితకాలంలో 65 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న తమాకి, అప్పుడే ఉద్యోగంలో చేరిన వ్యక్తి మాదిరిగా యాక్టివ్‌గా పనిచేస్తోంది. సన్‌కో కంపెనీని 1948లో స్థాపించగా, 8 ఏళ్ల తర్వాత అందులో ‘ఆఫీస్ అకౌంటెంట్’గా తమాకి విధుల్లో చేరింది. సిబ్బంది జీతాలు, బోనస్‌లు, పన్ను మినహాయింపులు అన్నీ ఆమె చూసుకుంటోంది. వృద్ధాప్యంలోనూ ఎంతో సిన్సియర్‌గా, డెడికేషన్‌తో పనిచేస్తున్న తమాకి అంటే సంస్థలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గౌరవం. ఇప్పటికీ తన మైండ్‌లో రిటైర్‌మెంట్ ఆలోచన లేదంటున్న తమాకిని గిన్నిస్ బుక్ సంస్థ ‘ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్’గా గుర్తించి, ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.
నో రిటైర్‌మెంట్..
‘మీరు ఈ రోజు వృథా చేస్తే, రేపు ఉండదు. నేను 90 ఏళ్లుగా చేయాలనుకున్నది చేస్తున్నాను, కాబట్టి ఏమి చెప్పాలో నాకు తెలియదు. మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలు. నేను ఎవరికైనా సహాయం చేయడానికే పుట్టానని ఎప్పుడూ అనుకుంటాను. కాబట్టి చైర్మన్, మేనేజర్లు, ఇతర సిబ్బందిని సంతోషపరిచే పనులు చేయాలనుకుంటున్నాను. అదే నా జీవిత లక్ష్యం. ఇక రిటైర్‌మెంట్ అంటారా? ఒక సంవత్సరం మొదలవుతుంది. అది కాలగర్భంలో కలిసిపోగానే మరో కొత్త ఏడాది మనకోసం వస్తుంది. నేను కూడా అంతే. అలా కొనసాగుతూనే ఉంటానని ఆశిస్తున్నాను. ధైర్యంగా జీవించడం నేర్చుకోవాలి’- తమాకి