ప్రపంచ విప్లవకారుడు చేగువేరా జయంతి

ప్రపంచ విప్లవకారుడు చేగువేరా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏ బైక్ మీద చూసినా ఆయన బొమ్మే, ఏ టీ-షర్ట్ మీద చూసినా ఆయన బొమ్మే కనిపిస్తుంది.

Update: 2024-06-14 10:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ విప్లవకారుడు చేగువేరా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏ బైక్ మీద చూసినా ఆయన బొమ్మే, ఏ టీ-షర్ట్ మీద చూసినా ఆయన బొమ్మే కనిపిస్తుంది. ఇలా చేగువేరా ఫొటోలను పెట్టుకునే చాలా మందికి ఆయన గురించి తెలియదు. కానీ, ఆయన ముఖం చూస్తూనే ఏదో తెలియని ఉత్తేజం మనలో కలుగుతుంది. అందుకే ప్రస్తుత కార్పోరేట్ కల్చర్ చొరబడిన అత్యుత్తమ వ్యాపార వస్తువుగా మారిపోయారాయన. ఆయన అర్జెంటీనా మార్క్సిస్ట్ నేత అని, క్యూబా విముక్తి పోరాటంలో కీలకపాత్ర పోషించిన విప్లవకారుడని కొంత మందికే తెలుసు. ముఖ్యంగా యువత ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న అసమానతలు తొలిగిపోవాలని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ తన పోరాటం చేశారు. ప్రాణాలకు తెగించి పోరాటం చేసి చేసి విముక్తి కల్పించారు. 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియా అనే పట్టణంలో జన్మించిన చేగువేరాను.. 1967 అక్టోబర్ 9న బొలీవియాలోని లా హిగువేరాలో అమెరికా సీఐఏకు బలైపోయారు. ఆయన్ను ఓ పాఠశాలలో బంధించి కాల్చి చంపారు. ఓ మహా ప్రస్థానానికి ముగింపు పలికారు. క్యూబా, అమెరికా వరకే పరిమితమైన ఆయన గొప్పతనం క్రమంగా ప్రపంచ దేశాలకు తెలిసింది. కొన్నేళ్ల పాటు క్యూబా, అర్జెంటీనా అమెరికా వరకే పరిమితమైన ఆయన గొప్పతనం క్రమంగా ప్రపంచ దేశాలకు తెలిసింది.


Similar News