లక్ అంటే ఇదేరా.. కారుపైకి భారీ కొండచరియ.. ఏమైందంటే
దిశ, నేషనల్ బ్యూరో : సిసలైన లక్ అంటే అతడిదే !! కారును కొంచెం స్పీడుతో నడిపినా.. అతగాడు పెద్ద బండరాయి కింద నలిగిపోయి ఉండేవాడు.
దిశ, నేషనల్ బ్యూరో : సిసలైన లక్ అంటే అతడిదే !! కారును కొంచెం స్పీడుతో నడిపినా.. అతగాడు పెద్ద బండరాయి కింద నలిగిపోయి ఉండేవాడు. బుధవారం తెల్లవారుజామున భూకంపం ధాటికి తైవాన్ వణికిపోయింది. ఆ టైంలో ఓ వ్యక్తి చుట్టూ కొండచరియలున్న ఏరియా మీదుగా కారులో జర్నీ చేస్తున్నాడు. రోడ్డుపై జర్నీ అప్పటిదాకా సాఫీగా సాగింది. అతడి ముందున్న కారు వేగంగా దూసుకుపోతోంది. ఓ వంతెన వద్దకు వెళ్లగానే అకస్మాత్తుగా బ్రిడ్జి రోడ్డుపైకి భారీ బండరాయి దూసుకొచ్చింది. సదరు వ్యక్తి కారు ఎదుట వెళ్తున్న మరో కారుపై అది పడింది. ఆ కారును బండరాయి నెట్టుకుంటూ వంతెన కిందికి లాక్కెళ్లింది. ఇదంతా వెనుక వైపున మరో కారులో ఉన్న వ్యక్తి చూస్తూ.. తన వాహనం స్పీడును తగ్గించాడు. కారును వెనక్కి నడపడం మొదలుపెట్టాడు. సమస్యాత్మకంగా ఉన్న ఆ కొండచరియల ఏరియా మీదుగా వెళ్లకుండా.. మరో సురక్షితమైన రూటు నుంచి తన గమ్యస్థానానికి జర్నీని ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడండి..!! కాగా, తైవాన్‌లో సంభవించిన భూకంపంలో వందలాది మందికి గాయాలు కాగా, పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.