గోర్బచెవ్ అంత్యక్రియలకు Vladimir Putin డుమ్మా

మాస్కో: దివంగత సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బచెవ్ అంత్యక్రియలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావడం లేదని స్పష్టమైంది. సోవియట్ కమ్యూనిస్టు నియంత్రణ నుంచి తూర్పు యూరప్‌ బయటపడటానికి అవకాశమిచ్చిన గొప్పనేతగా పాశ్చాత్యప్రపంచం గోర్బచెవ్‌ను ఆరాధించింది.

Update: 2022-09-02 13:36 GMT

మాస్కో: దివంగత సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బచెవ్ అంత్యక్రియలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావడం లేదని స్పష్టమైంది. సోవియట్ కమ్యూనిస్టు నియంత్రణ నుంచి తూర్పు యూరప్‌ బయటపడటానికి అవకాశమిచ్చిన గొప్పనేతగా పాశ్చాత్యప్రపంచం గోర్బచెవ్‌ను ఆరాధించింది. కానీ ఆయన దేశంలో ప్రవేశపెట్టిన పెరిస్త్రోయికా కల్లోలం సృష్టించి చివరకు సోవియెట్ విచ్ఛిన్నం కావడానికి కారణమైందని రష్యాలో చాలామంది ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోవియెట్ యూనియన్ వీరారాధకుడైన పుతిన్ తొలినుంచి గోర్బచెవ్‌ను ఇష్టపడేవారు కాదు.

అందుకే శనివారం జరుగనున్న ఆయన అంత్యక్రియలకు కూడా పుతిన్ హాజరు కావడంలేదని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. సోవియట్ యూనియన్ పతనం కాకుండా నిరోధించలేకపోయిన గోర్బచెవ్ అంటే పుతిన్‌కు ఎంత వ్యతిరేకత అంటే, ఆయన మరణించిన 15 గంటల తర్వాత పొడిపొడిగా సంతాప ప్రకటనను పుతిన్ వెలువరించారు. మాస్కోలో హాల్ ఆఫ్ కాలమ్స్ (యుద్ధవీరుల స్మారక భవనం)లో ప్రభుత్వ కార్యక్రమం తర్వాత గోర్బచెవ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోవియెట్ ప్రముఖ నేతలు వ్లాదిమిర్ లెనిన్, జోసెఫ్ స్టాలిన్, లియొనెద్ బ్రెజ్నెవ్ అంత్యక్రయలు కూడా క్రెమ్లిన్ సమీపంలోని గ్రాండ్ హాల్ లోనే జరిగాయి.

గోర్బచెవ్ ‌అంత్యక్రియలు కూడా ఇక్కడే జరగనున్నాయి కానీ సైనిక వందనం సమర్పించడం మినహాయిస్తే ప్రభుత్వ కార్యక్రమంగా ఇది జరగదని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. 91 సంవత్సరాల వయసులో మాస్కోలోని సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్‌లో అస్వస్థతతో మరణించిన గోర్బచెవ్‌ భౌతిక కాయం ముందు పుతిన్ సాంప్రదాయికంగా గురువారం ఎర్రగులాబీలు ఉంచారని రష్యా ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది.

((అయితే సెప్టెంబర్ 3న బిజీ షెడ్యూల్ కారణంగానే గోర్బచెవ్ అంత్యక్రియలకు పుతిన్ హాజరు కావడం లేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ తెలిపారు. సోవియెట్ కమ్యూనిస్టు బ్లాక్‌లో ఉంటున్న దేశాలు తమ దారి తాము చూసుకోవడానికి అనుమతించాలని గోర్బచెవ్ తీసుకున్న నిర్ణయం వల్లే తూర్పు, పశ్చిమ జర్మనీలు ఒక్కటయ్యాయి. తర్వాత యూనియన్ వ్యాప్తంగా జాతీయ ఉద్యమాలు చెలరేగి, 15 రిపబ్లిక్‌లు స్వతంత్రత ప్రకటించుకున్నాయి. కాగా 2000 సంవత్సరంలో అధికారం చేపట్టిన పుతిన్, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం 20వ శతాబ్దిలోనే అతిపెద్ద భాగోళిక-రాజకీయ ఉపద్రవంగా పేర్కొన్నారు.))

Tags:    

Similar News