Ukraine Russia war: రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడులు.. మాస్కో నగరంపై11డ్రోన్లతో అటాక్!

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ దూకుడు పెంచింది. ఇటీవలే రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలోకి ప్రవేశించిన ఆ దేశ దళాలు తాజాగా మాస్కో నగరంపై భారీ దాడులు చేపట్టాయి.

Update: 2024-08-21 12:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ దూకుడు పెంచింది. ఇటీవలే రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలోకి ప్రవేశించిన ఆ దేశ దళాలు తాజాగా మాస్కో నగరంపై భారీ దాడులు చేపట్టాయి. ఈ ప్రాంతంలో బుధవారం 11 డ్రోన్లతో విరుచుకుపడ్డట్టు రష్యా అధికారులు తెలిపారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే అని అభివర్ణించారు. అయితే ఈ డ్రోన్లన్నింటినీ రష్యా కూల్చి వేసిందని నగర మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. అంతేగాక పోడోల్స్క్ నగరంపై కొన్ని డ్రోన్లు ధ్వంసం చేశామని వెల్లడించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని పేర్కొన్నారు.

అలాగే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం 45 డ్రోన్లను రష్యా భూభాగంపై నాశనం చేసిందని తెలిపారు. వీటిలో మాస్కోలో11, బ్రయాన్స్క్ సరిహద్దు ప్రాంతంలో 23 , బెల్గోరోడ్‌లో 6 , కలుగ ప్రాంతంలో 3, కుర్స్క్‌‌లో 2 ఉన్నాయి. అలాగే క్రెమ్లిన్‌కు దక్షిణంగా 38 కిలోమీటర్లు దూరంలో ఉన్న పోడోల్స్క్ నగరంపై రెండు డ్రోన్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో సోబ్యానిన్ ఈ వివరాలను వెల్లడించారు. ఉక్రెయిన్ ఇటీవలి నెలల్లో మాస్కోను లక్ష్యంగా చేసుకుని పలు డ్రోన్‌లను ప్రయోగించింది, దీని వలన ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. అయితే, తాజాగా జరిగిన దాడి మాత్రం అతిపెద్దదని రష్యా భావిస్తోంది.

రష్యాను రెచ్చగొట్టే ప్రయత్నం: పుతిన్

ఉక్రెయిన్ డ్రోన్ దాడులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. రష్యాను భయపెట్టడానికి, రెచ్చగొట్టడానికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వారి వెనుక ఎవరున్నరో ఇప్పటికే అర్థమైందని తెలిపారు. కాగా, రష్యా అధికారులు చాలా అరుదుగా దాడుల వివరాలను బహిర్గతం చేస్తారు. దాని వైమానిక రక్షణ విభాగాలు నాశనం చేసే డ్రోన్‌లను మాత్రమే నివేదిస్తారు. నివాస లేదా పౌర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్న వివరాలు మాత్రమే వెల్లడిస్తారు. కానీ తాజాగా డ్రోస్ అటాక్ కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడం ఇదే తొలిసారి. అంతకుముందు ఉక్రెయిన్ కుర్క్స్ ప్రాంతంలోని నదులపై ఉన్న మూడు వంతెనలను ధ్వంసం చేసింది. 

Tags:    

Similar News