Olympics : ఒలింపిక్స్ ఆరంభ వేడుకలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ఈ సంవత్సరం పారిస్ లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు.

Update: 2024-07-30 11:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ఈ సంవత్సరం పారిస్ లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ప్రముఖ చిత్రకారుడు, లియోనార్డో డావిన్సీ యొక్క ప్రసిద్ధ పెయింటింగ్ ‘ది లాస్ట్ సప్పర్’ను అపహాస్యం చేసిన సన్నివేశంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సన్నివేశం ఒక వర్గాన్ని కించపరిచేటట్లు ఉందని మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. అయితే, ఒలింపిక్స్ నిర్వాహకులు మాత్రం తాము ఏ మతాన్ని ఉద్దేశించి ఆ ప్రదర్శన చేయలేదని వివరణ ఇచ్చారు.

2024 నవంబర్ 5న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుఫున అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్, సోమవారం రాత్రి ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘నేను చాలా ఓపెన్ మైండెడ్. కానీ వారు చేసింది చాలా అవమానకరమని నేను అనుకుంటున్నాను’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా విశ్వ క్రీడల ప్రారంభోత్సవాన్ని ఖండించారు.


Similar News