ప్రపంచంలోనే అత్యంత పొల్యూషన్ ఉండే నగరాలు ఇవే.. భారత్ నుంచి మూడు..
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితా విడుదలైంది. స్విస్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితా విడుదలైంది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ డేటా ప్రకారం ప్రపంచంలోనే కాలుష్య నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో పాకిస్తాన్‌లోని కరాచీ ఉండగా.. ఇక మూడో స్థానంలో భారత్‌లోని కోల్‌కత్తా నిలిచింది. ఢిల్లీలో గాలి నాణత్య 483గా ఉండగా.. కరాచీలో 371గా ఉంది. ఇక కోల్ కత్తాలో 206గా నమోదైనట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
ఇక ఈ జాబితాలో ముంబై కూడా చోటు సంపాదించుకుంది. ముంబైలో గాలి నాణ్యత 162గా రికార్డ్ అయింది. ఇక చైనాలోని వ్యూహాన్ పదో స్థానంలో నిలిచింది. ఇక్కడ గాలి నాణ్యత 152గా నమోదైంది. అయితే ఢిల్లీలో కాలుష్యం వల్ల స్కూళ్లకు ఐదు రోజుల పాటు సెలవు ప్రకటించారు. అలాగే భవన నిర్మాణ పనులను నిలిపివేశారు.