యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ వార్నింగ్
ఇటీవల కాలంలో యూకేలో అల్లర్లు, హింస దారుణంగా పెరిగిపోయింది. ఓ వర్గానికి చెందిన వారు విచ్చల విడిగా రోడ్లపైకి వచ్చి దర్నాలు చేస్తూ.. హింసకు పాల్పడుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో యూకేలో అల్లర్లు, హింస దారుణంగా పెరిగిపోయింది. ఓ వర్గానికి చెందిన వారు విచ్చల విడిగా రోడ్లపైకి వచ్చి దర్నాలు చేస్తూ.. హింసకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అల్లరి మూకలు షాపులు, కాంప్లెక్స్‌లలో దూరి అందినకాడికి దోచుకుంటున్నారు. అలాగే ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన భారత హైకమిషన్ అలర్ట్ జారీ చేసింది. దీంతో యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ సూచన ఇచ్చింది. అడ్వైజరీ జారీ చేసింది. యూకే చేరుకునే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది. అలాగే ఎవరైనా దాడులకు పాల్పడితే సేష్ జోన్ ఉండాలని వెంటనే తమకు సమాచారం అందించాలని లండన్ లోని భారత హైకమిషన్ సూచించింది.