Tesla: అమెరికాలోనూ ఇంతేనా.. ఇలా ఉన్నారేంట్రా బాబు

రాగి దొంగలు అమెరికాకు తలనొప్పిగా మారారు.

Update: 2024-05-15 09:59 GMT

దిశ వెబ్ డెస్క్: రాగి దొంగలు అమెరికాకు తలనొప్పిగా మారారు. ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల మరమ్మతుకే వేల డాలర్లను మెరికా ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా క్యాలీఫోర్నియాలో టెస్లాకు చెందిన 9 ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లలో దొంగలు కేబుల్‌ను దొంగిలించారు. కేబుల్‌ దొంగతనానికి గురైన విషయాన్ని వాహనధారులు గుర్తించి టెస్లాకు ఫిర్యాదు చేశారు. కాగా టెస్లా సాంకేతిక నిపుణులు 9 ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లలో మరమ్మతులు చేసి ఒక్క రోజులోనే మళ్ళీ ప్రజలకు అంధుబాటులోకి తీసుకువచ్చారు.

గతంలో మిన్నియాపాలిస్, మిన్నెసోటా, టెక్సాస్ మరియు హ్యూస్టన్‌లలో కేటుగాళ్లు రాగి దొంగతనానికి పాల్పడ్డినట్టు తెలుస్తోంది. FBI సమాచారం ప్రకారం.. ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్లు, సెల్యులార్ టవర్లు, టెలిఫోన్ ల్యాండ్ లైన్లు, రైలు మార్గాలు, నీటి బావులు, నిర్మాణ స్థలాలు మరియు ఖాళీగా ఉన్న గృహాలను లక్ష్యంగా రాగి దొంగతనానికి పాల్పడుతున్నారు. 


Similar News