92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి
ప్రముఖ వ్యాపారవేత్త, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ 92 ఏళ్ల వయసులో ఐదో వివాహం చేసుకోబోతున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ వ్యాపారవేత్త, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ 92 ఏళ్ల వయసులో ఐదో వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఆయనకు నాలుగు పెళ్లిళ్లు జరిగాయి. ఈ సారి ఆయన తన స్నేహితురాలు 67 ఏళ్ల వయసు కలిగిన ఎలెనా జుకోవాను జూన్ 2024లో వివాహం చేసుకోబోతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ పెళ్లి కాలిఫోర్నియాలోని మొరాగాలోని వైన్యార్డ్ ఎస్టేట్‌లో జరిగే అవకాశం ఉంది. రూపర్ట్ మర్డోక్ గత ఏడాది ఏప్రిల్‌లో లెస్లీ స్మిత్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు, కానీ నెల రోజుల్లోనే దాన్ని క్యాన్సల్ చేసుకున్నారు. ఆ తర్వాత జుకోవాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. తాజాగా వీరి వివాహం కన్ఫమ్ అయినట్లు తెలుస్తుంది.
1931లో ఆస్ట్రేలియాలో జన్మించిన రూపర్ట్ మర్డోక్ మొదటగా ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ అయిన ప్యాట్రిసియా బుకర్‌ను వివాహం చేసుకున్నాడు. ఆయన అమెరికాలో బిలియనీర్లలో ఒకరిగా ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్లలో పెద్ద వార్తాపత్రికలు, టీవీ ఛానెల్‌లకు యజమాని. 1996లో ఫాక్స్ న్యూస్‌ని ప్రారంభించాడు, 2013లో న్యూస్ కార్ప్ని స్థాపించాడు. దీని క్రింది వందలాది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలను కలిగి ఉన్నాడు.