ప్రధానిగా రిషి సునాక్ (Rishi Sunak).. నారాయణమూర్తి ఏమన్నారంటే..

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికవడం పట్ల ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి తొలిసారిగా స్పందించారు.

Update: 2022-10-25 05:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికవడం పట్ల ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి తొలిసారిగా స్పందించారు. తన అల్లుడైన రిషి సునాక్‌కి ఈ గౌరవం దక్కడం పట్ల గర్వంగా ఉందన్నారు. రిషికి విజయాలు చేకూరాలని కాంక్షించారు. 42 ఏళ్ల రిషి సునాక్ కన్సర్వేటివ్ పార్టీ నుంచి తొలి భారత సంతతి ప్రధానిగా ఎన్నికైన విషయం తెలిసిందే. రిషి సునాక్   యునైటెడ్ కింగ్ డమ్ ప్రజలకు సుపరిపాలన అందిస్తాడని నమ్మకముందన్నారు. రిషి తల్లి ఫార్మసిస్ట్ అని, తండ్రి డాక్టర్ అని తెలిపిన ఆయన రిషి ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక వించెస్టర్, ఆక్స్‌ఫర్డ్  పాఠశాలల్లో విద్యనభ్యసించాడన్నారు. గోల్డ్ మెన్ సాచ్ గ్రూప్ లో మూడేళ్లు పని చేసిన తర్వాత ఎంబీఏ చదవడం కోసం కాలిఫోర్నియాలోని స్టాన్ ఫర్డ్ వెళ్లాడని తెలిపారు. అక్కడే తన కూతురు అక్షతా మూర్తిని కలిసినట్లు గుర్తు చేశారు. 


Similar News