గాజా ఆసుపత్రి దాడిలో 170 మందికి పైగా ఉగ్రవాదులు మృతి: ఇజ్రాయెల్ సైన్యం
ఇజ్రాయెల్ సైన్యం గత కొద్ది రోజులుగా గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిపై జరిపిన దాడిలో ఇప్పటి వరకు 170 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం తెలిపింది
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ సైన్యం గత కొద్ది రోజులుగా గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిపై జరిపిన దాడిలో ఇప్పటి వరకు 170 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపింది. ఉగ్రవాదులు ఈ ఆసుపత్రిని ప్రధాన స్థావరంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారని మా దళాలు ఆసుపత్రి ప్రాంతంలో 800 మంది అనుమానితులను ప్రశ్నించాయని, అలాగే అనేక ఆయుధాలను గుర్తించినట్లు ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు. ఇది గాజా స్ట్రిప్‌లోని అతిపెద్ద ఆసుపత్రి. యుద్ధం ప్రారంభం కాకముందు ప్రధాన ఆసుపత్రిగా ఉంది. దాడుల తరువాత అది పౌరులకు నివాసంగా కూడా ఉంది. 350 మందికి పైగా హమాస్, ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాదులు ఇప్పటివరకు ఈ ఆసుపత్రిలో నిర్బంధించబడ్డారు. గత నవంబర్‌లో ఇజ్రాయెల్ దళాలు మొదటిసారి ఆసుపత్రిపై దాడి చేసినప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.