కుమారుడి వివాహ వేడుకలో ముఖేష్ అంబానీ ఎమోషనల్..కారణం ఇదే!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ ఇంట జరుగుతున్న వివాహ వేడుకలు కళ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ ఇంట జరుగుతున్న వివాహ వేడుకలు కళ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. సంప్రదాయం, గ్లామర్ కలగలిసి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వివాహ బంధంతో ఓ ఇంటివాళ్లు కాబోతున్న అనంత్-రాధిక జంటను చూసి..అంబానీ, మర్చంట్ కుటుంబాలు ఉద్వేగానికి గురవుతున్నాయి. నేడు అంగరంగా వైభవంగా అనంత్ అంబానీ-రాధిక వివాహం జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు అంతర్జాతీయ ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో కొడుకు ఓ ఇంటివాడవుతున్నడాని ఏ తండ్రికి అయిన సంతోషంగా ఉంటుంది.
ఇక వధూవరులు కూడా ఆనందంగా ఉంటే ఆ కుటుంబంలో రెట్టింపు ఆనందం కనబడుతోంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంట్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇరు కుటుంబాలు సంతోషంతో ఉప్పోంగి పోయారు. ఈ సంతోష సమయంలో ముఖేష్ అంబానీ ఒకింత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ముఖేష్ అంబానీ ఆనందబాష్పాలు రాల్చారు. వధువు రాధిక తల్లిదండ్రులు కూడా అలాగే కనిపించారు. అలాంటి దృశ్యాలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్చిలో ఈ అనంత్ అంబానీ, రాధికల ప్రీ వెడ్డింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (శుక్రవారం) రాత్రి వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు.