International Womens Day 2024: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 8న జరుపుకుంటారు

Update: 2024-03-08 02:47 GMT

దిశ, ఫీచర్స్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 8న జరుపుకుంటారు. సమాజాభివృద్ధిలో మహిళలదే కీలకపాత్ర. ఎందుకంటే ఇంటిపనుల దగ్గర నుంచి అన్ని రంగాలలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. విద్య, సేవ, సైన్స్, టెక్నాలజీ వంటి అనేక రంగాలలో వారి సహకారం చాలా ప్రత్యేకమైనది. ఈ కారణంగా, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం మహాశివరాత్రి నాడు వస్తుంది. స్త్రీ ఒక తల్లిగా, భార్యగా, చెల్లి, అక్కగా ఆమె బాధ్యతలకు గుర్తుగా ఆమెను గౌరవిస్తూ ఈ వేడుక జరుపుకుంటారు. అయితే, ఇది మార్చి 8నే ఎందుకు జరుపుకుంటారు తెలుసుకుందాం.

స్త్రీలు పురుషుల కంటే ఏ విధంగానూ తక్కువ కాదు. ఈ సమాజంలో స్త్రీ పురుషులు సమాన స్వేచ్ఛ ,సమాన హక్కుల కోసం పోరాడుతున్నారు. వారికీ కొన్ని ప్రత్యేక హక్కులున్నాయని గుర్తుగా వారికి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

నేడు ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే ని జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం ఒక వేడుకగా కాకుండా, మహిళా సాధికారత కోసం నిరంతరం సాగుతున్న ప్రయత్నం. మహిళలకు విద్య, ఆర్థిక స్వావలంబన, హక్కుల పరిరక్షణకు సమాజం నిరంతరం కృషి చేయాలి.


Similar News