కెనడాలో భారత విద్యార్థి హత్య
అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్న వేళ కెనడాలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. సౌత్ వాంకోవర్‌లో భారత్‌కు చెందిన చిరాగ్ అంటిల్ (24) అనే విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్టు
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్న వేళ కెనడాలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. సౌత్ వాంకోవర్‌లో భారత్‌కు చెందిన చిరాగ్ అంటిల్ (24) అనే విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్టు వాంకోర్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన ఘటన జరిగినట్టు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. చిరాగ్‌ను అతని కారులో ఉండగానే కాల్చి చంపినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా, హర్యానాకు చెందిన చిరాగ్ 2022లో కెనడాకు వెళ్లి.. ఇటీవలే ఎంబీఏ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. చిరాగ్ కుటుంబం అతని మృతదేహాన్ని భారతదేశానికి తరలించడానికి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ గోఫండ్‌మీ ద్వారా డబ్బు సేకరిస్తున్నట్టు సమాచారం. దీనిపై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ) చీఫ్ వరుణ్ చౌదరి స్పందించారు. విద్యార్థి కుటుంబానికి సహాయం చేయాలని విదేశీ వ్యవహారాల శాఖకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలే కెనడాలో భారత సంతతికి చెందిన బిల్డర్ బూటాసింగ్ గిల్‌ను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థిని సైతం కాల్చిచంపడం ఆందోళన కలిగిస్తోంది.