ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ మయన్మార్ ప్రజలకు అండగా నిలుస్తుంది: ప్రధాని మోడీ
మయన్మార్ లో శుక్రవారం సంభవించిన భారీ భూకంపం సంభవించింది. దీని కేంద్ర కేవలం 10 మీటర్ల లోతులో ఉండటం.. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు కావడంతో.. మాండలే సమీపంలోని అమరాపుర వంటి ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్: మయన్మార్ (Myanmar)లో శుక్రవారం సంభవించిన భారీ భూకంపం (huge earthquake) సంభవించింది. దీని కేంద్ర కేవలం 10 మీటర్ల లోతులో ఉండటం.. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు కావడంతో.. మాండలే సమీపంలోని అమరాపుర వంటి ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. మాండలేలోని బౌద్ధ మఠాలు, పురాతన రాజభవనం వంటి చారిత్రక నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయి. భారీ భవనాలు కుప్పకూలిపోవడంతో.. దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 1700 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ భారీ భూకంపం పై ఇప్పటికే స్పందించిన ప్రధాని మోడీ (Prime Minister Modi) మరోసారి.. మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ (Myanmar Senior General Min Aung Hlaing) తో మాట్లాడారు.
అనంతరం ఆయన ట్వీట్‌లో "నేను మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో మాట్లాడాను. వినాశకరమైన భూకంపంలో ప్రాణనష్టం జరిగినందుకు మేము మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసాము. సన్నిహిత మిత్రుడిగా, పొరుగువాడిగా.. ఈ క్లిష్ట సమయంలో భారతదేశం మయన్మార్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది. విపత్తు సహాయ సామగ్రి, మానవతా సహాయం, శోధన, రెస్క్యూ బృందాలను బాధిత ప్రాంతాలకు త్వరగా పంపుతున్నాము అని ప్రధాని తన ట్వీట్ లో రాసుకొచ్చారు. కాగా ఈ రోజు ఉదయం మయన్మార్ ప్రజల కోసం 'ఆపరేషన్ బ్రహ్మ' పేరుతో ప్రత్యేక విమానంలో.. మయన్మార్ ప్రజల కోసం.. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఆహార ప్యాకెట్లు, హైజీన్ కిట్లు, జనరేటర్లు, ఇతర వస్తువులు కలిపి 15 టన్నుల సామాగ్రిని మొదటి విడతలో యాంగోన్‌కు చేర్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇన్‌స్టాంట్ ఫుడ్, నీటి శుద్ది పరికరాలు, సౌర దీపాలు, పారాసెటమల్ ట్యాబ్లెట్లు, యాంటీబయాటిక్స్, కాన్యులా, సిరంజిలు, గ్లౌస్‌లు, కాటన్ బ్యాండేజీలు, మూత్ర సంచులను తక్షణ అవసరం నిమిత్తం పంపిన విషయం తెలిసిందే.