ట్రంప్ నిర్ణయంతో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన టారిఫ్ విధానాల వల్ల బంగారం ధర ఔన్స్‌కు 3,145 డాలర్లకు చేరినట్లు సమాచారం అందుతుంది.

Update: 2025-04-01 05:32 GMT
ట్రంప్ నిర్ణయంతో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తీసుకున్న నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన టారిఫ్ విధానాల వల్ల (tariff policies)  బంగారం ధర (gold price) ఔన్స్‌కు 3,145 డాలర్లకు ($3,145 per ounce) చేరినట్లు సమాచారం అందుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు (Gold prices in international markets) ఆల్‌టైమ్ రికార్డు (All-time record) స్థాయికి చేరుకున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్ (Trump Tariff War) కారణంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఆందోళనలు పెరగడంతో, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా ఉన్న బంగారం వైపు మొగ్గు చూపుతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ పరిపాలన కొత్తగా ఆటో దిగుమతులపై సుంకాలను విధించడం, అలాగే రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై ద్వితీయ టారిఫ్‌లను పరిశీలిస్తున్నట్లు ప్రకటించడం వంటి చర్యలు ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలను (Global trade tensions) పెంచాయి. ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు ఔన్స్‌కు 3,100 డాలర్ల ($3,100 per ounce) మార్కును అధిగమించి, 3,148 డాలర్ల వరకు చేరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ ధరల పెరుగుదల 1986 తర్వాత బంగారానికి బలమైన త్రైమాసిక పనితీరును సూచిస్తోంది. తాజాగా ట్రంప్ ప్రకటించిన ఈ టారిఫ్‌లు అమలులోకి వస్తే.. అంతర్జాతీయ మార్కెట్లలో ఆర్థిక అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా, బంగారం ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు నిపుణుల అంచనా ప్రకారం.. 2025 చివరి నాటికి బంగారం ధర ఔన్స్‌కు 3,500 డాలర్ల వరకు చేరే అవకాశం ఉంది. ఈ పరిణామాలు భారతదేశంలోనూ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఎందుకంటే భారత్ తన బంగారం అవసరాల్లో ఎక్కువ భాగం దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. అంతర్జాతీయ ధరల పెరుగుదలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా స్థానిక ధరలను ప్రభావితం చేస్తుంది.

Similar News