హెచ్ 1 బీ వీసా దారులకు గుడ్ న్యూస్.. అమెరికా కోర్టులో భారీ ఊరట

హెచ్‌1 బీ వీసాదారులకు అమెరికా కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ వీసాదారులు తమ జీవిత భాగస్వాములు కూడా పని చేసేందుకు అవకాశమిచ్చే నిబంధన ప్రస్తుతం కొనసాగుతుంది.

Update: 2024-08-04 06:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: హెచ్‌1 బీ వీసాదారులకు అమెరికా కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ వీసాదారులు తమ జీవిత భాగస్వాములు కూడా పని చేసేందుకు అవకాశమిచ్చే నిబంధన ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే దీనిని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ సవాల్ చేస్తూ.. కోలంబియా కోర్టులో పిటిషన్ వేసింది. అందులో హెచ్ 1 బీ వీసా దారులక భాగస్వాములకు ఉద్యోగాలివ్వరాదని, స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు దాన్ని కొట్టి వేసింది. అలాగే ఉద్యోగాల నియామకాలు నిబంధనల విషయంలో డీహెచ్ఎస్ ఇమిగ్రేషన్ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తుందని ఆ సందర్భంగా కొలంబియా కోర్టు తెలిపింది. ఈ నిర్ణయంతో హెచ్ 1 బీ వీసాదారులకు కోర్టులో ఊరట లభించింది. ఒకవేళ కోర్టు పిటిషన్ దారులకు మద్దతుగా నిలిస్తే మాత్రం అమెరికా వ్యాప్తంగా వేలాది మందిపై ప్రభావం చూపే అవకాశం ఉండేది.


Similar News