Helicopter Missing : 22 మందితో హెలికాప్టర్ మిస్సింగ్.. ముమ్మరంగా గాలింపు చర్యలు

దిశ, నేషనల్ బ్యూరో : రష్యాలో 22 మందితో బయలుదేరిన ఎంఐ-8 శ్రేణి హెలికాప్టర్ గల్లంతైంది.

Update: 2024-08-31 13:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో : రష్యాలో 22 మందితో బయలుదేరిన ఎంఐ-8 శ్రేణి హెలికాప్టర్ గల్లంతైంది. శనివారం తెల్లవారుజామున కమ్‌చత్కా ద్వీపకల్పంలోని వచ్కజెట్స్‌ అగ్నిపర్వతం సమీపం నుంచి 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో బయలుదేరిన ఈ హెలికాప్టర్ గమ్యస్థానానికి చేరలేదు. పైలట్ల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌కు ఎలాంటి సందేశమూ రాకపోవడంతో, అది ఎక్కడైనా కూలిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

దీంతో అధికారులు ఆ హెలికాప్టర్ వెళ్లిన మార్గంలోని నదీ లోయలు, పర్వత ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్‌లోని వారంతా పర్యాటకులే అని తెలుస్తోంది. 2021 సంవత్సరం ఆగస్టులో పొగమంచు కారణంగా దారి సరిగ్గా కనిపించక ఎంఐ-8 హెలికాప్టర్ కమ్‌చత్కా ద్వీపకల్పంలోని ఓ సరస్సులో కూలింది. ఆ ఘటనలో హెలికాప్టర్‌లోని 13 మంది చనిపోయారు. అదే ఏడాది జులైలో ఓ చిన్న సైజు విమానం కూలిన ఘటనలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రాణాలు విడిచారు.


Similar News