US presidential debate: అత్యుత్తమ చర్చల్లో ఒకటిగా భావిస్తున్నా

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్ రసవత్తరంగా సాగింది. ఇద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్‌పై రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) స్పందించారు.

Update: 2024-09-11 07:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్ రసవత్తరంగా సాగింది. ఇద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్‌పై రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) స్పందించారు. ఇది ఇప్పటివరకు జరిగిన అత్యుత్తమ చర్చ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘‘ఎప్పటికీ ఇది అత్యుత్తమ చర్చల్లో ఒకటిగా నేను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. కమలా హ్యారిస్(Kamala Harris), ట్రంప్.. ఇరువురి షేక్‌హ్యాండ్‌తో ఈ చర్చ ప్రారంభమైంది. 2016 తర్వాత ఇద్దరు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు కరచాలనం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇద్దరు అభ్యర్థులు ఒకరినొకరు ముఖాముఖి కలుసుకోవడం కూడా తొలిసారి. ఈ చర్చ.. అనంతరం పరస్పర విమర్శల దాడితో కొనసాగింది. కమలాహారిస్‌ బైడెన్‌ను వ్యతిరేకిస్తారని.. ఆయన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారని ట్రంప్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి అంతే దీటుగా బదులిచ్చారు కమల. ‘‘నేను జో బైడెన్‌ను కాదు. ట్రంప్‌నూ కాదు. నేను మన దేశానికి కొత్తతరం నాయకత్వాన్ని అందిస్తున్నాను’’ అంటూ సమాధానమిచ్చారు. ఇక, జోబైడెన్‌పై ట్రంప్‌ తీవ్ర విమర్శలు గుప్పించడంతో.. ‘‘మొదట మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు నాపై పోటీ చేస్తున్నారు.. జోబైడెన్‌పై కాదు’’ అంటూ మండిపడ్డారు.

కీలకంగా మారిన డిబేట్

మరో రెండు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి టైంలో వీరిద్దరి మధ్య డిబేట్ కీలకంగా మారనుంది. అయితే, జూన్‌ నెలాఖరులో జరిగిన డిబేట్ ఫలితంగా బైడెన్ ఎన్నికల ప్రచారం నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో అధ్యక్ష రేసులో కమలా హ్యారిస్ పోటీ పడుతున్నారు. దాదాపు అన్ని సర్వేల్లోనూ ఇద్దరు అభ్యర్థుల మధఅయ హోరాహోరీ పోటీ నెలకొంది. ఎన్నికల ముందు ఇరువురు అభ్యర్థులకు ఈ చర్చ కీలకమైన అవకాశంగా మారింది.


Similar News