Telegram CEO: టెలిగ్రామ్ సీఈవో అరెస్టులో రాజకీయ దురుద్దేశం లేదు : మాక్రాన్

దిశ, నేషనల్ బ్యూరో : టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను తమ దేశ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సమర్ధించుకున్నారు.

Update: 2024-08-26 17:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో : టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను తమ దేశ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సమర్ధించుకున్నారు. ఫ్రాన్స్ సోషల్ మీడియా చట్టాలను ఉల్లంఘిస్తూ టెలిగ్రామ్ కార్యకలాపాలను నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన తమ దేశంలో ఇప్పటికే టెలిగ్రామ్‌పై విచారణలో ఉన్న కేసుల్లో భాగంగానే పావెల్ దురోవ్‌ను అరెస్టు చేశామని మాక్రాన్ స్పష్టం చేశారు.ఈ అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని తేల్చి చెప్పారు.

‘‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఫ్రాన్స్ కట్టుబడి ఉంటుంది. ఇన్నోవేషన్‌ను, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఫ్రాన్స్ ప్రోత్సహిస్తూనే ఉంటుంది’’ అని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘టెలిగ్రామ్ సీఈవో అరెస్టు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీనిపై న్యాయమూర్తులే నిర్ణయం తీసుకుంటారు. మరెవరూ జోక్యం చేసుకోలేరు’’ అని మాక్రాన్ తెలిపారు.


Similar News