ఫ్రాన్స్ లో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లు మృతి

ఫ్రాన్స్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-08-16 00:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఫ్రాన్స్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.ఫ్రాన్స్ లోని ఈశాన్య ప్రాంతంలో రెండు రఫేల్ యుద్ధ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు.చనిపోయిన వారిలో ఒకరు ట్రైనీ పైలట్ కాగా మరొకరు సీనియర్ ట్రైనింగ్ పైలట్. ఈ ప్రమాదంలో కెప్టెన్ సెబాస్టియన్ మాబిరే మరియు లెఫ్టినెంట్ మాథిస్ లారెన్స్ మరణించడం తమను ఎంతో బాధ కలిగించిందని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ ఎక్స్‌ (X) లో పోస్ట్ చేసారు. అయితే రఫేల్ శిక్షణా మిషన్‌లో భాగంగా ఈ విమాన ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

రఫేల్ యుద్ధ విమానాలు మల్టీ రోల్ ఫైటర్ విమానాలుగా పేరు పొందాయి. ఇవి శత్రు విమానాలను వేటాడేందుకు, నేల, సముద్ర లక్ష్యాలను ఢీకొట్టడానికి, నిఘాను నిర్వహించడానికి అలాగే అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లడానికి చాలా ఉపయోగపడుతాయి. రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ ఆయుధ పరిశ్రమకు బెస్ట్ సెల్లర్‌గా మారాయి. ఇటీవలే భారత్ ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.కాగా రఫేల్ జెట్‌లతో ప్రమాదాలు జరగడం చాలా అరుదు.


Similar News