Earthquake : అమెరికాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదు

అమెరికాని భూకంపం వణికించింది.

Update: 2024-08-13 18:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాని భూకంపం వణికించింది. ఆ దేశంలోని లాస్ ఏంజెల్స్ సమీపంలో భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం లాస్ ఏంజిల్స్ దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం .యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం..బేకర్స్‌ఫీల్డ్, శాన్ డియాగో ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది.కాగా ఈ ఘటనలో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు.

అయితే భూకంపం తర్వాత అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ భూకంపం సంభవించినట్లుగా స్థానికులు తెలిపారు. అయితే భూప్రకంపనలు సంభవించిన వెంటనే లాస్ ఏంజెల్స్ , పసడేనా, గ్లెన్‌డేల్ వంటి ప్రాంతాల్లో పలువురు స్థానికులు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కార్యాలయాలను ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చారు.పలుచోట్ల కిటికీల అద్దాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా వారం రోజుల వ్యవధిలో అమెరికాలో భూమి కంపించడం ఇది రెండోసారి.


Similar News