Donald Trump : AI ని ఉపయోగించి కమలా హారిస్ మోసం చేస్తున్నారు.. ట్రంప్ విమర్శ

అమెరికాలో ఈ సంవత్సరం నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-12 19:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో ఈ సంవత్సరం నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధ్యక్ష అభ్యర్థులిద్దరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే .. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై విమర్శలు గుప్పించారు. కమలా హారిస్ కృత్రిమ మేథస్సు (AI)ని ఉపయోగించి మోసం చేస్తున్నారని తన X లో పోస్టు పెట్టారు.హారిస్ తమ ఎన్నికల ర్యాలీలో జనం ఎక్కువగా ఉన్నట్లు చూపించాడానికి AIని ఉపయోగించారని ట్రంప్‌ ఆరోపించారు.వివరాల్లోకెళ్తే నిన్న మిచిగాన్‌ డెట్రాయిల్‌లోని ఎయిర్‌పోర్ట్‌ దగ్గర జరిగిన ఎన్నికల ర్యాలీలో హారిస్ పాల్గొన్నారు.కాగా ఎయిర్‌పోర్ట్‌ వద్ద జరిగిన ఎన్నికల ర్యాలీలో భారీ జనాలున్న కొన్ని ఫోటోలను డెమోక్రటిక్ పార్టీ విడుదల చేసింది. అయితే డెమోక్రటిక్ పార్టీ విడుదల చేసిన ఫొటోలు నకిలీవని ట్రంప్ ఆరోపించారు. అసలు ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఎవరూ లేరని.. AIటెక్నాలజీ ఉపయోగించి భారీగా జనం ఉన్నట్లుగా చూపించారని, కమలా హారిస్ కోసం ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఎవరూ ఎదురుచూడలేదన్నారు.హారీస్ మోసం చేసి ఎన్నికల్లో గెలువాలనుకుంటున్నారని విమర్శించారు.

కాగా..ట్రంప్ విమర్శలపై కమలా హారీస్ స్పందించారు.రాను రాను ట్రంప్‌ కు శక్తి తగ్గుతోందని..ప్రచారం చేయడానికి ట్రంప్ కు తగినంత శక్తి లేదని అందుకే స్వింగ్‌ స్టేట్‌లో వారం రోజులుగా ట్రంప్ ప్రచారం చేయడం లేదని ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. కాగా త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పోటీ నుంచి జో బైడెన్‌ తప్పుకున్న విషయం తెలిసిందే . దీంతో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను అధికార పార్టీ ప్రకటించింది. కమలా భారతీయ మూలాలున్న మహిళగా అందరికి గుర్తుండే ఉంటుంది. కమలా హారీస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు కాగా.. ఆమె తండ్రి డోనాల్డ్ జాస్పర్ హారిస్ జమైకాకు చెందిన వ్యక్తి.దీంతో ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుంచి అధ్యక్ష పదవి బరిలో నిలిచిన తొలి భారత సంతతి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు . 

Tags:    

Similar News