‘లీప్’ న్యూస్‌పేపర్ తెలుసా..? నాలుగేళ్లకోసారి వచ్చే పత్రిక ఇదే..
ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ పేపర్లు సాధారణంగా డైలీ వస్తుంటాయి. లేదా కొన్ని వీక్లీ, మంత్లీ, ఇయర్లీ మ్యాగజైన్‌లు వస్తున్న విషయం అందరికి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ పేపర్లు సాధారణంగా డైలీ వస్తుంటాయి. లేదా కొన్ని వీక్లీ, మంత్లీ, ఇయర్లీ మ్యాగజైన్‌లు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. మరోవైపు ‘దిశ’ లాంటి డిజిటల్ పత్రికలు కూడా అన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ఎడిషన్‌లుగా వస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా ఫ్రాన్స్ లో ఓ న్యూస్ పేపర్ మాత్రం నాలుగేళ్లలో ఒకసారి మాత్రమే వస్తుంది. అది కూడా ప్రతి లిప్ సంవత్సరంలో ఒకసారి మాత్రమే దీన్ని ప్రచురిస్తారు. దీంతో ఇది ప్రపంచంలోనే అతి తక్కువ తరచుగా ప్రచురించబడే వార్తాపత్రికగా నిలిచింది. ఇవాళ ఫిబ్రవరి 29 కావడంతో ఫ్రాన్స్ వాసులు ఆ పత్రికను ఎగబడి చదివేస్తున్నారు.
ఫ్రాన్స్ దేశంలో 1980లో ‘లా బౌగీ డు సప్పర్ (ది సప్పర్స్ క్యాండిల్)’ (La Bougie du Sapeur) అనే వ్యంగ్యాస్త్రాలు విసిరే వార్త పత్రికను ప్రారంభించారు. ఫ్రాన్స్‌కు చెందిన తొలితరం కార్టూనిస్ట్ లీ సప్పర్ కామెంబెర్ట్ గుర్తుగా ఈ పత్రికకు పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇది నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరి 29లో ప్రచురితం అవుతుంది. కేవలం వినోదం కోసం మాత్రమే ఈ పత్రికను యాజమాన్యం తీసుకోచ్చారు. డైలీ లైఫ్‌లో జరిగే విచిత్ర ఘటనలపై సెటైర్లను ప్రచురిస్తూ ఉంటుంది. చివరిసారిగా ఈ పేపర్ 2020లో వచ్చింది. మళ్లీ నేడు 12వ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఈ పత్రిక మొత్తం 20 పేజీలతో ప్రింట్ వస్తుంది. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, క్రీడలు, సినిమాల వంటి వాటిపై సెటైరికల్ కథనాలు, ఫన్నీ జోక్స్‌తో పాటు క్రాస్‌వర్డ్స్‌ను కూడా ఇస్తారు. అయితే వాటి సమాధానాలు మాత్రం నెక్ట్స్ ఎడిషన్‌లో తెలుకోవాల్సిందే. జవాబుల కోసం నాలుగేళ్ల పాటు తప్పక వెయిటింగ్ చేయాల్సిందే. యాజమాన్యం దాదాపు 2 లక్షల న్యూస్ పేపర్ కాపీలను ముద్రిస్తుంది. పత్రిక ధర 4.9 యూరోలు ఉండగా.. భారత కరెన్సీలో దాదాపు రూ.450 వరకు ఉంటుంది. మరోవైపు ఈ పత్రిక ఆన్‌లైన్‌లో అందుబాటులోకి యాజమాన్యం తీసుకరాలేదు.