DK Shiva Kumar:కమలా హారిస్ తో భేటీపై డీకే శివకుమార్ క్లారిటీ..!

కర్ణాటక(Karnataka) డిప్యూటీ సీఎం , కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌(DK Shiva Kumar) ఈ రోజు రాత్రి అమెరికా(America) వెళ్లనున్నారు.

Update: 2024-09-08 19:19 GMT

దిశ, వెబ్‌డెస్క్:కర్ణాటక(Karnataka) డిప్యూటీ సీఎం , కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌(DK ShivaKumar) ఈ రోజు రాత్రి అమెరికా(America) వెళ్లనున్నారు. డెమొక్రాటిక్(Democratic) అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris) ఆహ్వానం మేరకు ఆయన అమెరికా పర్యటనకు వెళ్తున్నారని, ఈ పర్యటనలో  హారిస్ తో పాటు US మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama)తో DK భేటీ కానున్నట్టు తొలుత వార్తలు వినిపించాయి. అయితే తాజాగా దీనిపై డీకే శివకుమార్ స్పందించారు.తాను ఈ పర్యటనలో ఒబామా, హారిస్ తో భేటీ కానున్నానంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఆ వార్తలు అవాస్తమని, అమెరికా పర్యటన పూర్తిగా నా వ్యక్తిగతమని ఒక పత్రికా ప్రకటనలో సృష్టం చేశారు.నా కుటుంబంతో కలిసి నేను అమెరికా వెళ్తున్నాను, సెప్టెంబర్ 15 వరకు అక్కడే ఉంటాను.నేను అమెరికాలోని కొంతమంది అగ్రనేతలతో భేటీ అవుతానన్న వార్తలు పూర్తిగా అవాస్తమని వెల్లడించారు.

తన అమెరికా పర్యటనకు సంబంధించి ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)కు రాసిన లేఖను కూడా DK మీడియాకు విడుదల చేశారు.నేను ఇప్పటికే తెలియజేసినట్లుగా, సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం ప్రైవేట్ పర్యటన నిమిత్తం అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు వెళతాను. సెప్టెంబర్16న ఇండియాకు తిరిగి వస్తానని శివకుమార్ ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు.కాగా శివకుమార్ అంతకుముందు రోజు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Siddaramaiah)ను ఆయన నివాసంలో కలిశారని అధికారిక వర్గాలు తెలిపాయి.మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ ప్రవాస భారతీయులతో, విద్యా, వ్యాపారవేత్తలో సమావేశం కానున్నారు.


Similar News