చందమామపై క్రాష్ ల్యాండ్.. చరిత్రకు పది మీటర్ల దూరంలో ఆగిపోయిన జపాన్!
జపాన్‌లో రాకెట్ ప్రయోగం విఫలమైంది. మంగళవారం జపాన్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ఐ స్పేస్ చంద్రుడి మీద లాండర్ను దించేందుకు ప్రయత్నించింది.
దిశ, వెబ్‌డెస్క్: జపాన్‌లో రాకెట్ ప్రయోగం విఫలమైంది. మంగళవారం జపాన్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ఐ స్పేస్ చంద్రుడి మీద లాండర్ను దించేందుకు ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నం విఫలమైనట్లు సమాచారం. చందమామ మీద ఆ వ్యోమనౌక దిగడానికి కాసేపటి ముందే భూ కేంద్రానికి.. ఆ వ్య్యోమనౌకకు సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. చంద్రుడి మీద దిగలేకపోవడానికి కారణం ఏంటి? అని తేల్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
ఈ ల్యాండింగ్ ప్రయోగం కనక విజయవంతం అయితే.. చంద్రుడి మీద వ్యోమ నౌకను దింపిన తొలి ప్రైవేట్ కంపెనీగా ఐస్పేస్ చరిత్ర సృష్టించేది. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండర్లను రష్యా, అమెరికా, చైనాలకు చెందిన ప్రభుత్వ రంగ అంతరిక్ష సంస్థలు మాత్రమే దింపాయి. కాగా, గత ఏడాది డిసెంబర్‌లో స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌లో ప్రయోగించిన తర్వాత నెల రోజుల క్రితమే ఈ వ్యోమనౌక చంద్ర కక్ష్యలోకి పంపడం గమనార్హం. అయితే, ల్యాండింగ్ ప్రయత్నం సమయంలో కమ్యూనికేషన్ బ్లాక్ చేయబడింది, అది లక్ష్యానికి చేరుకుందని అనుకరణ చూపినప్పటికీ.. ఆ తర్వాత పోయినట్లు నిర్ధారించారు.