కాలిఫోర్నియా యూనివర్శిటీలో ఇజ్రాయెల్-పాలస్తీనా మద్దతుదారుల మధ్య ఘర్షణ

మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధాల సెగ అమెరికాను తాకుతున్నాయి. ఇజ్రాయిల్- హామాస్ యుద్ధాన్ని ఆపివేయాలని అమెరికా యూనివర్శిటీల్లో గత కొంత కాలంగా చాలా మంది నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-01 09:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధాల సెగ అమెరికాను తాకుతున్నాయి. ఇజ్రాయిల్- హామాస్ యుద్ధాన్ని ఆపివేయాలని అమెరికా యూనివర్శిటీల్లో గత కొంత కాలంగా చాలా మంది నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం తెల్లవారుజామున లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఇజ్రాయెల్-పాలస్తీనా మద్దతుదారులు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అడ్డంగా ఉన్నటువంటి మెటల్ బారికేడ్లను కూల్చివేసి చీకట్లో బాణసంచా కాల్చడం అలాగే వస్తువులను ఒకరిపై ఒకరు విసురు కోవడం చేశారు. ఈ దాడులకు సంబంధించిన ఫొటోలు అక్కడి టీవీల్లో కనిపించాయి. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

యూనివర్శిటీ ఛాన్సలర్ నిరసనకారులను హెచ్చరించారు. క్యాంపస్ పరిధిలో ఎలాంటి అలజడులు సృష్టించవద్దని కోరారు. క్యాంపస్‌తో సంబంధం లేని వారు లోపలికి ప్రవేశించి శిబిరాలను ఏర్పాటు చేసుకుని ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. UCLA కమ్యూనిటీ సభ్యులు, ఇతరులు క్యాంపస్‌లో గొడవలు చేయవద్దని హెచ్చరించారు. మంగళవారం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పోస్ట్‌లో క్యాంపస్‌లో ఎలాంటి నిరసనలు లేవని అందరూ శాంతియుతంగా ఉన్నారని పేర్కొనగా బుధవారం ఉదయం తిరిగి ఘర్షణలు చోటు చేసుకోవడం గమనార్హం.


Similar News