UNOలో భారత ప్రతిపాదనను వ్యతిరేకించిన చైనా

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని భారత్ ప్రతిపాధించింది.

Update: 2023-05-11 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని భారత్ ప్రతిపాధించింది. ఇది నచ్చని చైనా భారత ప్రతిపాదనను వ్యతిరేకించింది. దీంతో మరోసారి చైనాకు పాక్ తో.. పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులతో ఉన్న బంధం బయటపడింది. కాగా గతంలో అబ్దుల్ రవూఫ్ జెఎమ్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు, భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడుల అములులో పాల్గొన్నట్లు భారత్ నివేదించింది. అయినా కూడా చైనా భారత్ కు వ్యతిరేకంగా నిలబడి మాట్లాడింది. దీంతో మరోసారి చైనా వక్రబుద్ధి బయటపడింది.

Tags:    

Similar News