Israel Hamas War: ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ చీఫ్ రాజీనామా.. ఎందుకంటే?

ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ ‘యూనిట్‌ 8200’('Unit 8200') చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న యాస్సి సారిల్‌(Yossi Sariel) రాజీనామా చేశారు.

Update: 2024-09-13 07:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ ‘యూనిట్‌ 8200’('Unit 8200') చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న యాస్సి సారిల్‌(Yossi Sariel) రాజీనామా చేశారు. ఇజ్రాయెల్ భద్రతా అధికారులు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై(Israel) హమాస్‌(Hamas) చేసిన దాడులకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు యాస్సి సారిల్ పేర్కొన్నారు. ఇప్పటికే దాడుల నిలువరించడంలో వైఫల్యం పొందానని.. దానికి బాధ్యతగా ఇజ్రాయెల్‌ మిలటరీ నిఘా విభాగం అధిపతి మేజర్‌ జనరల్‌ అహరోన్‌ హలీవా ఏప్రిల్‌లో రాజీనామా చేశారు. 2023 సెప్టెంబరులోనే తమ దేశంపై దాడికి హమాస్‌ ప్రయత్నిస్తున్నట్లు ‘యూనిట్‌ 8200’ నివేదికలో హెచ్చరించిందని జూన్‌లోనే అధికారులు వెల్లడించారు.

ఇప్పటివరకు 1200 మంది మృతి

అక్టోబరు 7న హమాస్‌ ఉగ్రవాదుల మెరుపుదాడులకు(Israel Hamas War) పాల్పడింది. ఆ ఘటనలో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఇక, గాజాలో ఇప్పటివరకు కనీసం 41,118 మంది మృతి చెందినట్లు భూభాగ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలేనని ఐక్యరాజ్యసమితి మానవ హక్కల కార్యాలయం వెల్లడించింది. అయితే గాజాలో యుద్ధం ముగిసేవరకు అక్టోబర్ 7 నాటి దాడులపై విచారణ ప్రారంభించేందుకు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు పదే పదే నిరాకరిస్తున్నారు.


Similar News