Breaking : ఇజ్రాయెల్‌కు భారీ సహాయం ప్రకటించిన అమెరికా
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అమెరికా భారీ సహాయం ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్ : ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అమెరికా భారీ సహాయం ప్రకటించింది. దాదాపుగా 20 బిలియన్ డాలర్ల విలువైన యుద్ధ విమానాలు, క్షిపణులు ఉక్రెయిన్ కు అమ్మడానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఇందులో అనేక ఫైటర్ జెట్‌లు మరియు అధునాతన ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించింది.
అలాగే 50 కంటే ఎక్కువ F-15 ఫైటర్ జెట్‌లు, అడ్వాన్స్‌డ్ మీడియం రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు లేదా AMRAAMలు, 120 mm ట్యాంక్ మందుగుండు సామగ్రి అలాగే అధిక పేలుడు మోర్టార్లు మరియు వ్యూహాత్మక వాహనాలను ఉక్రెయిన్ కు అమెరికా ప్రభుత్వం విక్రయించింది. అయితే ఇజ్రాయెల్‌కు ఈ ఆయుధాలు ఎప్పుడు చేరుకుంటాయని సమాచారం లేదు. ఈ ఆయుధాలు ఉక్రెయిన్ చేరుకోవటానికి సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కాగా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇజ్రాయెల్ కు ఈ ఆయుధాలు ఎంతో సహాయం చేయనున్నాయి.