మహిళనే పెళ్లాడిన మహిళా మంత్రి.. ఎక్కడ ? ఎందుకు ?

దిశ, నేషనల్ బ్యూరో : ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పెళ్లి వ్యవహారం సంచలనం క్రియేట్ చేసింది.

Update: 2024-03-17 13:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పెళ్లి వ్యవహారం సంచలనం క్రియేట్ చేసింది. దేశంలోనే తొలి స్వలింగ సంపర్క మహిళా పార్లమెంటేరియన్‌గా ఇప్పటికే ఒక రికార్డును కలిగి ఉన్న పెన్నీ.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ద్వారా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె పెళ్లిలో రికార్డు క్రియేట్ చేసే విషయం ఏముందబ్బా అని ఆలోచిస్తున్నారా ? మరేం లేదు.. స్వలింగ సంపర్కురాలైన పెన్నీ వాంగ్ అదే కేటగిరీకి చెందిన మరో మహిళను స్వలింగ వివాహం చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్లుగా తనతో సంబంధం కొనసాగిస్తున్న నెచ్చెలి సోఫీ అల్లోవాచేను పెన్నీ పెళ్లాడారు. ఈవిషయాన్ని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ఆదివారం వెల్లడించారు. పెళ్లి వేడుక సందర్భంగా తన నెచ్చెలి సోఫీ అల్లోవాచేతో కలిసి పూల గుత్తి పట్టుకున్న ఒక ఫొటోను ఆమె ట్విట్టర్‌లో షేర్ చేశారు. శనివారం రోజు దక్షిణ ఆస్ట్రేలియా రాజధాని అడిలైడ్‌లోని వైనరీలో తమ పెళ్లి వేడుక జరిగిందని పెన్నీ తెలిపారు. 2017 సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహానికి చట్టబద్ధత కల్పించారు.

Tags:    

Similar News