పారిస్ 2024 ఒలింపిక్స్‌లో డ్రోన్ల ముప్పుపై కీలక నిర్ణయం
2024 ఒలింపిక్స్ పారిస్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ల ముప్పు బారిన పడకుండా ఈవెంట్‌ను సురక్షితంగా నిర్వహించడానికి అక్కడి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: 2024 ఒలింపిక్స్ పారిస్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ల ముప్పు బారిన పడకుండా ఈవెంట్‌ను సురక్షితంగా నిర్వహించడానికి అక్కడి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ సమయంలో ఆకాశంలో ఎగిరే ప్రతివస్తువును నిరంతం పర్యవేక్షించడానికి ఎయిర్ ట్రాఫిక్‌పై అప్రమత్తంగా ఉండటానికి అధికారులు యాంటీ-డ్రోన్ యూనిట్‌ను ఉపయోగించబోతున్నారు. యాంటీ-డ్రోన్ రక్షణకు జనరల్ ఆఫీసర్ జనరల్ అర్నాడ్ బోర్గుగ్నాన్ మాట్లాడుతూ, డ్రోన్ల ద్వారా ఈవెంట్‌పై దాడి చేసే అవకాశం ఉంటుంది. అన్ని డ్రోన్లను నిషేధించడానికి వీలులేదు, ఎందుకంటే కొన్ని డ్రోన్‌లను మీడియా ఉపయోగిస్తోంది, కొన్ని ఈవెంట్‌లను రిఫరీ చేయడానికి ఉపయోగిస్తారు, కాబట్టి ఈవెంట్ నిర్వహణ సమయంలో పూర్తి స్థాయిలో డ్రోన్లను నిషేధించడం వీలుకాదు. అందుకే యాంటీ-డ్రోన్‌ను వాడబోతున్నాము. దీనిలో రాడార్, కెమెరాలు, జామింగ్ యాంటెన్నా ద్వారా ప్రతి డ్రోన్‌ను క్షణ్ణంగా గమనిస్తాము. వాటిలో ఏదైనా ప్రమాదం కలిగించే డ్రోన్లు ఉన్నట్లయితే కిలోమీటర్ దూరం నుంచే వాటిని నిలువరిస్తామని అన్నారు. 2024 ఒలింపిక్స్ పారిస్‌లో జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.