కెనడాకు భారత్ అల్టిమేటం.. అక్టోబర్ 10 వరకు డెడ్‌లైన్

భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా కెనడా విషయంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2023-10-03 08:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా కెనడా విషయంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో కెనడా తమ దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని ఆ దేశానికి భారత ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మన దేశంలో 62 మంది కెనడా దేశానికి సంబంధించిన దౌత్య సిబ్బంది ఉండగా వారిలో 41 సిబ్బందిని అక్టోబర్ 10 లోగా తగ్గించుకోవాలని కెనడాకు భారత్ సూచించినట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది.

గడువు లోగా సిబ్బందిని వెనక్కి పిలిపించుకోకుంటే అదనపు సిబ్బందికి రక్షణ తొలగిస్తామని హెచ్చరించినట్లు ఈ కథనం పేర్కొంది. అయితే ఈ విషయంలో ఇరు దేశాల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత ఎజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు ప్రతిష్టంభన ఏర్పడింది.

Tags:    

Similar News