జపాన్‌ దేశంలో మరోసారి భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

గురువారం మధ్యహ్నం దక్షిణ జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదైనట్లు తెలుస్తుంది.

Update: 2024-08-08 08:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: గురువారం మధ్యహ్నం దక్షిణ జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదైనట్లు తెలుస్తుంది. ఈ భూకంప కేంద్ర దక్షిణ జపాన్‌లోని క్యుషు ద్వీపంలో సంబవించగా..7.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే తమ ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, మొదటి భూకంపం జపాన్ యొక్క దక్షిణ ప్రధాన ద్వీపం క్యుషు తూర్పు తీరంలో సుమారు 30 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. కాగా ఈ భూకంపం ప్రభావంతో ఎటువంటి ఆస్తీ ప్రాణ నష్ట్రం జరిగిందనే దానిపై ప్రస్తతుం ఎటువంటి సమాచారం అందలేదు.

ఈ భారీ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని తీర ప్రాంత ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే భూకంపాలకు ప్రతిస్పందనగా జపాన్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 125 మిలియన్ల ప్రజలు నివసించే ఈ ద్వీపసమూహం ప్రతి సంవత్సరం దాదాపు 1,500 భూకంపాలను ఎదుర్కొంటుంది. వీటిలో ఎక్కువ భాగం తేలికపాటివి కాగా కొన్ని చాలా బలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే గత సంవత్సరం చివర్లో సంబంధించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 260 మంది మరణించారు.


Similar News