గాల్లోనే డెలివరీ! గర్భిణీకి డెలివరీ చేసిన పైలట్.. పిల్లాడి పేరు కూడా పెట్టేశారు
దిశ, డైనమిక్ బ్యూరో: విమానంలో పురిటి నోప్పులతో భాదపడుతున్న ఓ మహిళకు విమానం పైలట్ డాక్టర్‌గా మారి మహిళలకు డెలివరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల వియట్‌జెట్ విమానం తైవాన్‌లోని తైపీ నుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు వెలుతుంది. ఈ క్రమంలోనే ఓ మహిళలకు ఫ్లైట్‌లో పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో సిబ్బంది పైలట్ జాకరిన్‌కు తెలియజేశారు.
విమానం అత్యవసర ల్యాండింగ్ చేయడం కుదరకపోవడంతో తల్లీ బిడ్డకు ఏమీ కావొద్దన్న ఉద్దేశంతో డెలివరీ చేయడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే విమానం బాధ్యతలు కో-పైలట్‌కు అప్పగించాడు. అనంతరం సెల్‌ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించి వారి సూచనలతో సిబ్బంది సహాయంతో మహిళకు పురుడు పోశాడు. దీంతో క్షేమంగా డెలివరీ చేసిన పైలట్ జాకరిన్‌ను ప్రయాణికులంతా ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే ఆయన డెలివరీ చేసిన బిడ్డను పట్టుకుని ఉన్న ఫోటోను ఆయన ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
"నేను 18 సంవత్సరాలు పైలట్‌గా ఉన్నాను. నేను విమానంలో నవజాత శిశువుకు సహాయం చేసాను." సిబ్బంది చిన్నారికి ‘స్కై’ బేబీ అని ముద్దు పేరు పెట్టారని పైలట్ పేర్కొన్నారు. దీంతో తను చేసిన పోస్ట్ తాజాగా వైరల్ అయ్యింది. మరోవైపు తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.