ఆ రికార్డులు ఇంకా ధోని పేరుమీదే
దిశ, స్పోర్ట్స్ : టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శనివారం తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. ధోని నిర్ణయంతో ఆయన అభిమానులే కాక, యావత్ క్రికెట్ అభిమానులు నివ్వెరపోయారు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని, ఈ క్రమంలో ఎన్నో రికార్డులు కూడా సృష్టించారు. అయితే ధోని చేసిన రికార్డులు ఇప్పటికీ కొన్ని అలాగే ఉండిపోయాయి. అవేంటో చూద్దాం – అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక […]
దిశ, స్పోర్ట్స్ : టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శనివారం తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. ధోని నిర్ణయంతో ఆయన అభిమానులే కాక, యావత్ క్రికెట్ అభిమానులు నివ్వెరపోయారు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని, ఈ క్రమంలో ఎన్నో రికార్డులు కూడా సృష్టించారు. అయితే ధోని చేసిన రికార్డులు ఇప్పటికీ కొన్ని అలాగే ఉండిపోయాయి. అవేంటో చూద్దాం
– అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన క్రికెటర్‌గా ధోని రికార్డులకు ఎక్కాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి 332 మ్యాచ్‌లలో కెప్టెన్సీ వహించాడు. 200 వన్డేలు, 60 టెస్టులు, 72 టీ20ల్లో ధోనీ భారత జట్టు తరపున కెప్టెన్సీ వహించాడు
– అత్యధిక ఫైనల్ విజయాలు
ఒక కెప్టెన్‌గా బహుళ జాతి వన్డే సిరీస్‌లు గెలిచిన క్రికెటర్‌గా ధోని రికార్డు సృష్టించాడు. మూడు, అంతకన్నా ఎక్కువ దేశాలు ఆడిన టోర్నీల్లో నాలుగు సిరీస్‌లు ధోని నెగ్గాడు. మరోవైపు కెప్టెన్‌గా 110 వన్డేల్లో విజయం సాధించాడు. ఈ విషయంలో పాంటింగ్ తర్వాత రికార్డు ధోనిదే
– అత్యధిక నాటౌట్స్
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన క్రికెటర్‌గా ధోని రికార్డు సాధించాడు. ధోని 84 సార్లు నాటౌట్‌గా నిలవగా.. ఆ తర్వాత స్థానంలో 72 నాటౌట్లతో షాన్ పొలాక్ నిలిచాడు.
– అత్యధిక స్టంపింగ్స్
ఎంఎస్ ధోనీ 350 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 125 స్టంపింగ్స్ చేశాడు. ఇది ఐసీసీ రికార్డు. ధోనీ తర్వాతి స్థానంలో మార్క్ బౌచర్, అడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నారు.