వరల్డ్ టాప్-10 హ్యపీయెస్ట్ కంట్రీస్ లిస్ట్.. మనమెక్కడంటే!
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే సంతోషంగా ఉండే టాప్-10 దేశాలకు సంబంధించిన జాబితాను ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు-2021’ ప్రకటించింది. దీని ప్రకారం.. సంతోషంగా ఉండే దేశాల జాబితాలో మొదటిస్థానంలో ఫిన్లాండ్, ఐస్‌లాండ్, డెన్మార్క్, స్విజ్జర్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, జర్మనీ, నార్వే న్యూజిలాండ్, ఆస్ట్రియా లాంటి దేశాలు చోటు దక్కించుకోగా.. జింబాబ్వే, టాంజానియా, జోర్డాన్, ఇండియా, కొలంబియా, బెనిన్, మయన్మార్, నమీబియా, ఈజిప్ట్, కెన్యా లాంటి దేశాలు కింద నుంచి పది స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదికను ప్రధానంగా […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే సంతోషంగా ఉండే టాప్-10 దేశాలకు సంబంధించిన జాబితాను ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు-2021’ ప్రకటించింది. దీని ప్రకారం.. సంతోషంగా ఉండే దేశాల జాబితాలో మొదటిస్థానంలో ఫిన్లాండ్, ఐస్‌లాండ్, డెన్మార్క్, స్విజ్జర్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, జర్మనీ, నార్వే న్యూజిలాండ్, ఆస్ట్రియా లాంటి దేశాలు చోటు దక్కించుకోగా.. జింబాబ్వే, టాంజానియా, జోర్డాన్, ఇండియా, కొలంబియా, బెనిన్, మయన్మార్, నమీబియా, ఈజిప్ట్, కెన్యా లాంటి దేశాలు కింద నుంచి పది స్థానాల్లో నిలిచాయి.
ఈ నివేదికను ప్రధానంగా జీడీపీ స్థాయి, లైఫ్ ఎక్స్పెటెన్సీ, దాతృత్వం, సోషల్ సపోర్ట్, స్వేచ్ఛ, అవినీతి ఆదాయం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని రిలీజ్ చేశారు. 2012 నుంచి ప్రపంచంలో హ్యాపీగా ఉండే దేశాలపై నివేదికలు వెలువడుతుండగా.. 2020 కరోనా పాండమిక్ సమయంలోనూ దీనిపై రీసెర్చ్ జరిగింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఎంటంటే..‘‘ప్రజల జీవన ప్రమాణాన్ని మూల్యాంకనం చేసినప్పుడు సగటున క్షేమం క్షీణించలేదని’’ అని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ‘జాన్ హెల్లీవెల్’ వెల్లడించారు.
అయితే, వరల్డ్ హ్యపీనెస్ రిపోర్టులో ఇండియా చివరి నుంచి 10 స్థానాల్లో చోటు దక్కించుకోవడంపై భారతీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్నిమారినా దేశంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవడం లేదని.. దశాబ్దాలుగా అపరిష్కృతంగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంతో పాటు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఫైర్ అవుతున్నారు. ఉన్న సమస్యలను పరిష్కరించక పోగా, కొత్తవి సృష్టిస్తున్నారని.. క్రమంగా భారతీయుల జీవన ప్రమాణాలు మరింత దిగజారుతుండటంపై అభివృద్ధి చెందిన దేశాలతో పాటు పలు రీసెర్చ్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.