భారత్ కు ప్రపంచ బ్యాంకు 100 కోట్ల డాలర్ల సాయం!
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రపంచ బ్యాంకు భారత్ కు 100 కోట్ల డాలర్ల సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 100 కోట్ల డాలర్లను భారత్ కు అందజేయనుంది. కరోనా వైరస్ తో బాధపడుతున్న దేశాలకు మద్దతుగా నిలిచేందుకు వరల్డ్ బ్యాంక్ నిర్ణయించుకున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఆపత్కాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేక నిధి కేటాయించింది. భారత్ కు అత్యవసర నిధి కింద 100 కోట్ల డాలర్లు (సుమారు 7500 […]
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రపంచ బ్యాంకు భారత్ కు 100 కోట్ల డాలర్ల సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 100 కోట్ల డాలర్లను భారత్ కు అందజేయనుంది. కరోనా వైరస్ తో బాధపడుతున్న దేశాలకు మద్దతుగా నిలిచేందుకు వరల్డ్ బ్యాంక్ నిర్ణయించుకున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఆపత్కాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేక నిధి కేటాయించింది. భారత్ కు అత్యవసర నిధి కింద 100 కోట్ల డాలర్లు (సుమారు 7500 కోట్ల రూపాయలు) అందించనుంది. ఈ సహాయాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు అప్రూవ్ చేసినాక కరోనా స్క్రీనింగ్, బాధితుల కాంటాక్ట్ ట్రేసింగ్ కు.. కొత్త ల్యాబ్స్, ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు, రక్షణ పరికరాలను సమకూర్చుకోవడానికి ఈ సొమ్ము ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
Tags: World bank, financial aid, india, billion dollars, coronavirus