జీఎం కార్యాలయం ముందు కార్మికుల ధర్నా

దిశ, తాండూర్: గోలేటీలోని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ కేంద్ర కమిటీ కార్యదర్శి బోగె ఉపేందర్ మాట్లాడుతూ గోలేటి సి.హెచ్.పిలోని రైల్వే ట్రాక్ నిర్వాహణకు సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం వలన వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించే […]

Update: 2021-12-01 01:34 GMT

దిశ, తాండూర్: గోలేటీలోని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ కేంద్ర కమిటీ కార్యదర్శి బోగె ఉపేందర్ మాట్లాడుతూ గోలేటి సి.హెచ్.పిలోని రైల్వే ట్రాక్ నిర్వాహణకు సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం వలన వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం సంబంధిత అధికారికి నాయకులు, కార్మికులు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో గోలేటి బ్రాంచ్ సహాయ కార్యదర్శి సాగర్ గౌడ్, సి.హెచ్.పి కార్మికులు వెంకటి, కిరణ్, రాజన్న, అరవిందు, వినోద్, మహేందర్, శోభన్, పోచయ్య, సీతారాం, మారుతి పాల్గొన్నారు.

Tags:    

Similar News