చలనం రాలేదని.. మొకాళ్లపై నిరసన

దిశ, సంగారెడ్డి: ఆశా పరిశ్రమ యాజమాన్యం ప్రకటించిన అక్రమ లే ఆఫ్ ను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మొకాళ్లపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు రిలే, నిరాహారదీక్షలు మొదలు పెట్టి 14 రోజులు గడిచినా పరిశ్రమ యాజమాన్యంలో చలనం రాకపోవడంతో నేటి నుండి సమ్మె చేస్తున్నట్లు సీఐటీయూ నాయకులు సాయిలు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఆశా మెషిన్స్ టూల్స్ పరిశ్రమలో లాక్ […]

Update: 2020-07-20 03:53 GMT

దిశ, సంగారెడ్డి: ఆశా పరిశ్రమ యాజమాన్యం ప్రకటించిన అక్రమ లే ఆఫ్ ను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మొకాళ్లపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు రిలే, నిరాహారదీక్షలు మొదలు పెట్టి 14 రోజులు గడిచినా పరిశ్రమ యాజమాన్యంలో చలనం రాకపోవడంతో నేటి నుండి సమ్మె చేస్తున్నట్లు సీఐటీయూ నాయకులు సాయిలు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఆశా మెషిన్స్ టూల్స్ పరిశ్రమలో లాక్ డౌన్ పేరుతో లేఆఫ్ ను ప్రకటించి కార్మికులను విధుల్లో నుండి తొలగించడం చట్ట విరుద్ధమన్నారు. కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లాక్ డౌన్ కాలానికి కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆశా పరిశ్రమ యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలంయూ ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ కార్మిక సంఘం నాయకులు బాగా రెడ్డి, దత్తు, కార్మికులు సంతోష్, శ్రీధర్, ప్రభాకర్, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News