వర్క్ ఫ్రమ్ హోమే కరక్ట్!

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ ప్రభావం వల్ల తాజాగా చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన అంశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. ఇది అప్పటిదాకా ఒక్క సాఫ్ట్‌వేర్ పరిశ్రమ, ఐటీ ఉద్యోగుల్లోనే పాపులర్‌గా ఉండేది. కరోన వైరస్ వ్యాప్తి నిరోధించడానికి ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి సమూహంగా పనిచేయకుండా ఇంటి నుంచే పనిచేయమని ఒక్క సాఫ్ట్‌వేర్ కంపెనీలే కాక వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇటీవల సూచిస్తున్నాయి. ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లి పనిచేస్తే ఎక్కువ పని గంటలు పనిచేస్తారా లేదా […]

Update: 2020-03-19 07:11 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ ప్రభావం వల్ల తాజాగా చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన అంశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. ఇది అప్పటిదాకా ఒక్క సాఫ్ట్‌వేర్ పరిశ్రమ, ఐటీ ఉద్యోగుల్లోనే పాపులర్‌గా ఉండేది. కరోన వైరస్ వ్యాప్తి నిరోధించడానికి ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి సమూహంగా పనిచేయకుండా ఇంటి నుంచే పనిచేయమని ఒక్క సాఫ్ట్‌వేర్ కంపెనీలే కాక వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇటీవల సూచిస్తున్నాయి. ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లి పనిచేస్తే ఎక్కువ పని గంటలు పనిచేస్తారా లేదా ఇళ్ల నుంచి పనిచేస్తే ఎక్కువగా పని చేస్తారా అనే అంశంలో జరిగిన ఒక సర్వేలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించి ఆసక్తికర విషయలు బయటపడ్డాయి.

వీటిలో ముఖ్యమైనవి ఇవీ..

1) ఆఫీసు నుంచి దూరంగా ఉండి పనిచేసే ఉద్యోగులు లాంగ్ బ్రేకులు తీసుకుంటారట కానీ ఎక్కువ సమయం ప్రొడక్టివ్ ఉంటారట. అంటే ఆఫీసులో కూర్చుని పనిచేసే వాళ్ల కంటే క్వాలిటీగా పని చేస్తారని అర్థం.
2) కార్యాలయాల్లో కూర్చొని పనిచేసేవాళ్ల కంటే ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు నెలకు 1.4 రోజులు, సంవత్సరానికైతే అదనంగా 3 వారాలు ఎక్కువ పనిచేస్తారని సర్వేలో తేలింది.
3) వర్క్, లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి తాము స్ట్రగుల్ అవుతున్నామని ఇంటి నుంచి పనిచేసే వాళ్లు చెప్పారు.
4) ఇళ్ల నుంచి పనిచేయడం వల్ల రోజూ ఆఫీసుకు ప్రయాణించే బాధ తప్పుతోందని, ఆరోగ్యంగా ఉంటున్నామని చెప్పారు. దీని వల్ల యజమానికి, తమకు ఇరువురికీ లాభం జరుగుతోందని తెలిపారు.

Tags : corona, work from home, software, productive

Tags:    

Similar News