వర్క్ ఫ్రమ్ హోమ్, కానీ..
గత మూడు నెలలుగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కరోనా భయంతో దాదాపు కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వీకెండ్స్ తీసుకోకుండా విపరీతంగా కష్టపడి పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు టెక్ కంపెనీలకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. చూడబోతే ఈ కరోనా భూతం ఇప్పట్లో పోయేలా లేదు, అలాగని పనిని ఆపలేం. కానీ ఎక్కువ రోజులు ఉద్యోగులు తమ సొంత కంప్యూటర్ నుంచి పనిచేస్తే సెక్యూరిటీ సమస్యలు తలెత్తే […]
గత మూడు నెలలుగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కరోనా భయంతో దాదాపు కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వీకెండ్స్ తీసుకోకుండా విపరీతంగా కష్టపడి పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు టెక్ కంపెనీలకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. చూడబోతే ఈ కరోనా భూతం ఇప్పట్లో పోయేలా లేదు, అలాగని పనిని ఆపలేం. కానీ ఎక్కువ రోజులు ఉద్యోగులు తమ సొంత కంప్యూటర్ నుంచి పనిచేస్తే సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అందర్నీ మళ్లీ ఆఫీసులకు రావాలని పిలుస్తున్నాయి. ఉండిపోవడానికి కాదులెండి!
ఆఫీస్ కంప్యూటర్లు తీసుకెళ్లడానికి రమ్మంటున్నాయి. ఎంత క్లౌడ్‌లో పనిచేసినా, హ్యాకర్ల భయం పెరుగుతుండటంతో ప్రతి చిన్న సమాచారం చాలా ముఖ్యమైనదిగా భావించి సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే సొంతూళ్లలో వైఫై పెట్టించుకుని పనిచేస్తున్న వారిని వెంటనే వచ్చి ఆఫీస్ ల్యాప్‌టాప్ తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఆఫీస్ వరకు రాలేని వారికి కంప్యూటర్లను కొరియర్ ద్వారా పంపిస్తున్నాయి. అయితే ఇటీవల ఓ వ్యక్తి.. జీతం సమయానికి వేయలేదన్న కారణంతో ఆఫీస్ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను అమ్మేశాడని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. మరి ఇలాంటి ఉద్యోగులను కంపెనీలు ఎలా హ్యాండిల్ చేస్తాయో చూడాలి మరి!