మొన్న పెళ్లి.. ఇవాళ ఆత్మహత్య

దిశ, వెబ్ డెస్క్: ఇష్టం లేని పెళ్లి చేశారని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట మండలం వై. సీతానగరంలో విషాదం నెలకొన్నది. రమ్యశ్రీ అనే యువతికి ఇటీవలే వివాహమైంది. అయితే, ఆ యువతి నేడు ఆత్మహత్యకు పాల్పడింది. ఇష్టంలేని పెళ్లి చేశారని ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతి వార్త విని యువతి కుటంబ సభ్యులు […]

Update: 2020-07-31 23:19 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇష్టం లేని పెళ్లి చేశారని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట మండలం వై. సీతానగరంలో విషాదం నెలకొన్నది. రమ్యశ్రీ అనే యువతికి ఇటీవలే వివాహమైంది. అయితే, ఆ యువతి నేడు ఆత్మహత్యకు పాల్పడింది. ఇష్టంలేని పెళ్లి చేశారని ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతి వార్త విని యువతి కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags:    

Similar News