మంత్రి అజయ్ క్షమాపణ చెప్పాలని మహిళా సర్పంచ్ దీక్ష
దిశ ప్రతినిధి, ఖమ్మం: ప్రొటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వకపోగా అవమానకర రీతిలో మాట్లాడిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్షమాపణ చెప్పేంత వరకు పోరాటం కొనసాగిస్తానని ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామ సర్పంచ్ సుభద్ర స్పష్టం చేశారు. వేదిక మీదకు పిలవకుండా అవమానించిన మంత్రి అజయ్ తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బుధవారం మద్దులపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామస్తులు, ప్రజా సంఘాలతో కలిసి ఆమె నిరసన దీక్ష […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: ప్రొటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వకపోగా అవమానకర రీతిలో మాట్లాడిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్షమాపణ చెప్పేంత వరకు పోరాటం కొనసాగిస్తానని ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామ సర్పంచ్ సుభద్ర స్పష్టం చేశారు. వేదిక మీదకు పిలవకుండా అవమానించిన మంత్రి అజయ్ తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బుధవారం మద్దులపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామస్తులు, ప్రజా సంఘాలతో కలిసి ఆమె నిరసన దీక్ష చేపట్టారు. రెండు రోజుల క్రితం గ్రామంలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొటోకాల్ ప్రకారం సర్పంచ్ సుభద్రను స్టేజీపైకి ఆహ్వానించాల్సిందిగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోరడంతో మంత్రి అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తిపై కేసు పెట్టాలంటూ మంత్రి అజయ్ కోపోద్రిక్తుడయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు సర్పంచ్‌కు మద్దతు తెలిపాయి. ప్రొటోకాల్ ప్రకారం వేదికపైకి సర్పంచ్‌ను ఆహ్వానించండని అడగటమే సదరు వ్యక్తి చేసిన తప్పా..? అంటూ ప్రశ్నించారు. నిరసన దీక్షలో సర్పంచ్ సుభద్రత నిరసన దీక్షకు ఐద్వా, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, మాలమహనాడు సంఘాలు సంఘీభావం తెలిపాయి. సుభద్ర దళిత మహిళా సర్పంచ్ కావడం వలనే మంత్రి అజయ్‌కుమార్ ఆ విధంగా వ్యాఖ్యలు చేశారని కుల సంఘాల నాయకులు పేర్కొన్నారు. సుభద్రకు మంత్రి అజయ్ క్షమాపణ చెప్పేంతవరకు ఆమె పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు.