రూ.10 వేలు ఇవ్వలేదని ముగ్గురిపై గ్యాంగ్ రేప్ కేసు.. పోలీసులను పిచ్చోళ్లను చేసి..!

దిశ, వెబ్‌డెస్క్ :మహిళలకు రక్షణగా నిలుస్తున్న చట్టాలను కొందరు నిర్వీర్యం చేసేలా తప్పుగా వినియోగిస్తున్నారు. తమ స్వార్థం కోసం అమాయకులను పలు కేసుల్లో ఇరికించేందుకు బ్లాక్ మెయిలింగ్‌‌లకు సైతం పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదారాబాద్‌కు చెందిన ఓ మహిళ తనకు డబ్బులు ఇవ్వలేదని ముగ్గురు వ్యక్తులపై ఏకంగా గ్యాంగ్ రేప్ కేసు పెట్టించింది. దర్యాప్తులో భాగంగా ఈ కేసు ఫేక్ అని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకివెళితే.. నగరానికి చెందిన ఓ మహిళ తన ఇంటికి పక్కనే […]

Update: 2021-11-08 05:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ :మహిళలకు రక్షణగా నిలుస్తున్న చట్టాలను కొందరు నిర్వీర్యం చేసేలా తప్పుగా వినియోగిస్తున్నారు. తమ స్వార్థం కోసం అమాయకులను పలు కేసుల్లో ఇరికించేందుకు బ్లాక్ మెయిలింగ్‌‌లకు సైతం పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదారాబాద్‌కు చెందిన ఓ మహిళ తనకు డబ్బులు ఇవ్వలేదని ముగ్గురు వ్యక్తులపై ఏకంగా గ్యాంగ్ రేప్ కేసు పెట్టించింది. దర్యాప్తులో భాగంగా ఈ కేసు ఫేక్ అని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకివెళితే.. నగరానికి చెందిన ఓ మహిళ తన ఇంటికి పక్కనే ఉండే వ్యక్తిని మెడికల్ ట్రీట్మెంట్ కోసం రూ.10 వేలు ఇవ్వాలని కోరింది.

అందుకు ఆ వ్యక్తి నిరాకరించడంతో అతనితో పాటు మరో ఇద్దరు స్నేహితులపై గ్యాంగ్ రేప్ కేసు పెట్టించింది. ఇంటి స్థలం చూపిస్తానని తనను కారులో తీసుకెళ్లి సామూహిక హత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ముందుగా మహిళ చెప్పింది నిజం అని నమ్మి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో ఇదంతా అబద్ధం అని గుర్తించారు. చివరకు ఆ మహిళను గట్టిగా నిలదీయగా అసలు విషయం అంగీకరించింది. తను అడిగిన డబ్బులు ఇవ్వనందుకే వారిపై గ్యాంగ్ రేప్ కేసు పెట్టినట్టు అంగీకరించింది. దీంతో మహిళను పోలీసులు తీవ్రంగా మందలించి, ఆ ముగ్గురిని విడుదల చేసినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News